త్వరలో హీరో విశాల్ ఇంట్లో మోగనున్న పెళ్లి బాజా ..!!​

SMTV Desk 2018-12-31 13:17:31  Hero vishal,marriage,sharathkumar,varalaksmi,gkreddy,nadigar,chennai,cine industry

​చెన్నయ్, డిసెంబర్ 31: ​ప్రముఖ సినీ నటుడు​,నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ​త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి వెల్లడించారు. అనీశా అనే యువతిని విశాల్ పెళ్లాడబోతున్నాడు. నిశ్చితార్థ వేడుక త్వరలోనే హైదరాబాదులో జరగనుంది. నిశ్చితార్థం పనులను ప్రారంభించే పనిలో విశాల్ కుటుంబీకులు ఉన్నట్టు కోలీవుడ్ సమాచారం.

మరోవైపు, నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన సినీ నటి వరలక్ష్మి ని విశాల్ పెళ్లాడనున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వీరి వివాహంపై చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవలే ఈ అంశంపై వరలక్ష్మి క్లారిటీ ఇస్తూ... విశాల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది.