ఘాజి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తో ??

SMTV Desk 2018-12-31 13:08:51  Ghaji,Antariksham,Ranadaggubati,varuntej,satyadev,Idreams

హైదరాబాద్, డిసెంబర్ 31: మొదటి సినిమా తోనే అవార్డు సాధించిన ఘాజి సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. చాలా తక్కువ బడ్జెట్ లో భారీగా అనిపించే సినిమాలు చేయడం ఇతని ప్రత్యేకత. అలాంటి సంకల్ప్ రెడ్డి "మీ ఫస్టు సినిమా ఘాజీ కదా .. ఆ సినిమా షూటింగు సమయంలో ఆర్టిస్టులుగానీ .. టెక్నీషియన్లుగానీ మిమ్మల్ని తక్కువగా చూశారా?. మీరొక కొత్త డైరెక్టర్ కాబట్టి, ఏం తీస్తున్నాడురా ఈయన అన్నట్టుగా అసహనానికి లోనైనా సందర్భాలు ఏమైనా ఉన్నాయా?" అనే ప్రశ్న సంకల్ప్ రెడ్డిని అడగగా, అందుకు ఆయన స్పందిస్తూ .. ఘాజీ సినిమాకి మంచి టెక్నీషియన్లు పనిచేశారు .. మంచి నటీనటులు వున్నారు. ఈ సినిమా సెట్ లో ఉదయం నుంచి రాత్రి వరకూ షూటింగ్ చేసేవాళ్లం. ఎప్పుడు ఎవరూ కూడా ఇదేం పిచ్చి సినిమా అన్నట్టుగా ఎవరు బిహేవ్ చేయలేదు స్వంత సినిమా లా కష్టపడ్డారు .. నన్ను ఎవరూ తక్కువగా చూడలేదు. నేను ఏం చేయాలనే క్లారిటీ నాకు ఉండటమే అందుకు కారణం కావచ్చు అని చెప్పుకొచ్చాడు.