మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు బాబు గారూ: జగన్

SMTV Desk 2018-12-30 17:12:47  Jaganmohan Reddy, Chandra Babu, Twitter

విజయవాడ, డిసెంబర్ 30: వైసీపీ అదినేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఇష్టం లేదని టీడీపీ నేతలు ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. అందుకే కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలో దీక్షలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల విమర్శలపై జగన్ ట్విట్టర్ లో స్పందించారు. టీడీపీ నేతలకు తెలియకపోయినా తాము ప్రజల కోసం ఉద్యమిస్తూనే ఉన్నామని జగన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఈ మేరకు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇచ్చారు.

‘రాజకీయ నాటకంలో కుట్రపూరిత కూటములు కడుతూ, కొత్త మిత్రులను వెతుకుతూ, ఏపీ పాలనను గాలికొదిలేసి తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు.. మా ఉద్యమాలు తెలియకపోవచ్చు. కానీ మేము చేసిన నిరంతర పోరాటం రాష్ట్రప్రజలకు సుపరిచితం. ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబు నాయుడు గారూ! అని ట్వీట్ చేశారు.