కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు..

SMTV Desk 2018-12-30 14:34:31  Chandrababu, KCR, Press Meet

అమరావతి, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిన్న కేసీఆర్ తనపై దారుణంగా మాట్లాడారని.. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హుందాతనం లేకుండా, పద్ధతి లేకుండా అసభ్యకరమైన భాష మాట్లాడారని దీనిని ఖండిస్తున్నానని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని అన్నారు. తానెప్పుడూ పద్ధతి లేని రాజకీయాలు చేయలేదని, విలువలతో కూడిన రాజకీయాలు చేశానని, ఎప్పుడూ హుందాతనాన్ని కోల్పోయి మాట్లాడలేదని స్పష్టం చేశారు.

తననే కాదు, కాంగ్రెస్ పార్టీని, ప్రధాని మోదీపైనా కేసీఆర్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. రాజకీయాల్లో హుందాతనం, విలువలు ఉంటాయని, అధికారంలో ఉండే వ్యక్తులు చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. నాగరిక ప్రపంచం ఆయన తీరును మెచ్చుకోదని, నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు.