భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్

SMTV Desk 2017-07-27 17:02:00  indian, criketers, jobs, lost,

ముంబాయి, జూలై 27 : తాజాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో భారత క్రికెటర్లు ఉద్యోగాలు కోల్పోయారు. క్రికెటర్లు ఏ ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగం చేయవద్దని బీసీసీఐ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారు వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇప్పటి వరకు పలు ప్రభుత్వరంగ కంపెనీలలో పని ఉద్యోగం చేస్తున్న క్రికెటర్లు... విరాట్ కోహ్లి, అజింక్య రహనే, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, చటేశ్వర్ పుజార, గౌతమ్ గంభీర్ లు ఉన్నారు. వీరు వెంటనే రాజీనామా చేయనున్నట్లు సమాచారం.