కెసిఆర్ ''ఖబడ్ధార్''..!

SMTV Desk 2018-12-30 11:11:44  KCR, Telangana, AP CM, Chandrababu

విజయవాడ, డిసెంబర్ 30: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలతో దూషించారని ఆరోపిస్తూ, విజయవాడలోని గాంధీనగర్ ప్రాంతంలో శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తక్షణం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కార్యకర్తలు, కేసీఆర్ దిష్టి బొమ్మను, పోస్టర్లను దహనం చేశారు. తమ సీఎంపై అవాకులూ, చవాకులు పేలితే అంతు చూస్తామని, ఓటర్ కు, క్వార్టర్ కు తేడా తెలియని కేసీఆర్ కు, తెలుగుజాతి స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబుపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. టీడీపీ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు "ఖబడ్దార్ కేసీఆర్..." అంటూ విరుచుకుపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెల్లాచెదరు చేశారు.