పర్యాటకులపై బాంబుల దాడి....

SMTV Desk 2018-12-29 20:49:46  Egypt, Tour, Terrorists, Attack with bombs, Bus accident

ఈజిప్ట్, డిసెంబర్ 29: పర్యాటకులతో వెళ్తున్న బస్సును టార్గెట్ చేస్తూ బాంబులతో పేల్చారు అక్కడి ఉగ్రవాదులు. ఆ పేలుడు వ‌ల్ల న‌లుగురు మృతిచెందారు. మ‌రో 10 మంది గాయ‌ప‌డ్డారు. గిజా పిర‌మిడ్ల విహార‌యాత్ర‌కు వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌ను టార్గెట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో టూరిస్టు గైడ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆల్ మారియోటా రోడ్డు వ‌ద్ద అమ‌ర్చిన పేలుడు ప‌దార్థం విస్పోట‌నం చెంద‌డంతో బ‌స్సు అదుపు త‌ప్పింది..