రైతులకి కొండంత అండనిచ్చిన కర్ణాటక సీఎం

SMTV Desk 2018-12-29 20:25:45  HD Kumara swamy, Karnataka, CM, Nikhil

కర్నాటక, డిసెంబర్ 29: కర్ణాటకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి భాగల్‌కోట్ జిల్లా రైతులకు రుణ విముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయడానికి సంబంధిత అధికారులు, బ్యాంకులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంకుల ద్వారా రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రుణాలను ఎట్టి పరిస్థితుల్లో మాపీ చేసి తీరతానని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేయనని తన వొక్కగానొక్క కొడుకు నిఖిల్(సినీనటుడు)మీద వొట్టేసి చెబుతున్నా అన్నదాతలు ఆందోళన చెందవద్దంటూ కుమార స్వామి భావోద్వేగానికి లోనయ్యారు.

త్వరలో రాష్ట్రంలోని రైతులందరి రుణాలు మాపీ అవుతాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం రైతులకు పక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరించడానికే పనిచేస్తోందన్నారు. రైతులకు మోసం చేయాలన్న ఆలోచన తమకు ఏమాత్రం లేదని అన్నదాతలేవ్వరూ అదైర్యపడొద్దన్నారు. పంటలకు గిట్టుబాట ధర అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వచ్చే ఏడాది నుండి రైతులు పండిచిన పంటకు నికర లాభం ఉండేలా చూసుకుంటామని కుమార స్వామి స్పష్టం చేశారు.