రీపీట్ అవుతున్న వెంకటేశ్, వినాయక్ కాంబినేషన్..!

SMTV Desk 2018-12-29 18:01:17  Bala krishna, Venkatesh, VV Vinayak, New Movie

హైదరాబాద్, డిసెంబర్ 29: మాస్ దర్శకుడు వి.వి వినాయక్ విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. యాక్షన్, ఎమోషన్, కామెడీని కలిపి ఆడియన్స్ కి కావలసిన విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాలి అన్నుకుంటున్నాడని సమాచారం. వినాయక్ ఇంటిలిజెంట్ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లోనే మంచి కథను సిద్ధం చేసుకుని బాలకృష్ణతో సెట్స్ పైకి వెళ్లాలని భావించాడు. కానీ, బాలకృష్ణ తన తదుపరి సినిమాను బోయపాటితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి నిర్మాతగా సి.కల్యాణ్ ఎంతగానో ప్రయత్నించాడుగానీ కుదరలేదు.

అయితే ఆయన కోసం తయారు చేసిన కథను వినాయక్ .. వెంకటేశ్ కి వినిపించాడట. వెంకటేశ్ ఆ కథపట్ల సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. ఆయన ఓకే చెప్పేయడం ఖాయమని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్మీ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.