అమెరికన్ ఫెడెక్స్‌ ప్రెసిడెంట్‌గా భారతీయ వాసి

SMTV Desk 2018-12-29 17:51:04  American multinational coriar, FedEx, president, Indian, Subramaniam. Rajesh Subramaniam

అమెరికా, డిసెంబర్ 29: అమెరికా మల్టీ నేషనల్‌ కొరియర్‌ దిగ్గజ కంపెనీ ఫెడెక్స్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రెసిడెంట్‌గా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా భారత్ కు చెందిన రాజేష్‌ సుబ్రమణియం నామినేట్‌ అయ్యారు. 2019 జనవరి 1 ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. డేవిడ్‌ ఎల్‌ చున్నింగ్‌ హాం స్థానంలో ఆయన నియమితులయ్యారు. సుబ్రమణియం ప్రస్తుతం ఫెడెక్స్‌ కార్పొరేషన్‌కు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా, చీఫ్‌మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. తిరువనంతపురం నుంచి ఐఐటీ బాంబే గ్రాడ్యుయేషన్‌ చేసిన సుబ్రమణియం 27 ఏళ్లకు పైగా ఫెడెక్స్‌లో పనిచేస్తున్నారు. మెంఫీస్‌లో తన కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సుబ్రమణియం ఆ తర్వాత హాంకాంగ్‌ వెళ్లి ఫెడక్స్‌ కంపెనీ ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో మార్కెటింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌లో పనిచేశారు.