రాజధానిని ముంచేసిన మంచు

SMTV Desk 2018-12-29 17:24:09  New delhi, Winter weather, Temperature, Decreased

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: రాజధానిలో ఇవాళ ఉదయం అత్యంత తక్కువగా 2.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఢిల్లీ వాసులు చలికి వణికిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత అని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. ఈరోజు ఉదయం 8.30 సమయంలో గాలిలో 85శాతం తేమ ఉందని తెలిపారు. నేడు అత్యధిక ఉష్ణోగ్రత 19డిగ్రీలకు మించకపోవచ్చని పేర్కొన్నారు. ఉదయం నగరంలోని చాలా ప్రాంతాల్లో కేవలం 1500మీటర్ల దూరం లోపు మాత్రమే కనిపించిదని చెప్పారు. పాలం ప్రాంతంలో మరీ తక్కువగా 800మీటర్ల విజిబులిటీ మాత్రమే ఉందని తెలిపారు.