తెరపైకి మోదీ బయోపిక్..!

SMTV Desk 2018-12-29 16:37:54  Narendra Modi, Biopic

హైదరాబాద్, డిసెంబర్ 29: ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉండటంతో బయోపిక్ ల వైపు దర్శకనిర్మాతలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. తాజాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను నిర్మించేందుకు బాలీవుడ్ లో రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి వొమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ బయోపిక్ కు సంబంధించి... స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అంశాలపై వొమంగ్ టీమ్ భారీ వర్క్ చేస్తోందట. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

ప్రముఖ నటుడు వివేక్ వొబెరాయ్ ను ఈ చిత్రంలో మోదీ పాత్రను పోషించేందుకు సంప్రదించినట్టు సమాచారం. వివేక్ వొబెరాయ్ ప్రధాన పాత్రను పోషిస్తే ఈ సినిమాకి దక్షిణాదిన కూడా మంచి ఆదరణ లభిస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. దక్షిణాదిన ఇప్పటికే పలు చిత్రాల్లో వివేక్ వొబెరాయ్ నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న వినయ విధేయ రామ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.