వైసీపి తీర్థం పుచ్చుకున్న టీడీపి నేత...???

SMTV Desk 2018-12-29 16:31:07  TDP, MLA, YSRCP, Erigela rampullareddy, Aallagadda

కర్నూల్, డిసెంబర్ 29: ఆళ్లగడ్డకు చెందిన టిడిపి నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైఎస్‌ఆర్‌సిపిలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం ఆళ్లగడ్డలో అనుచరులతో సమావేశమైన టీడీపీ నేత రాంపుల్లారెడ్డి ఈ మేరకు వారితో సంప్రదింపులు జరిపారని, వైఎస్‌ఆర్‌సిపి లో రాజకీయ భవితవ్యంపై చర్చించారని సమాచారం. టిడిపిలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే తాను పార్టీ మారనున్నానని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తుంది.