జనవరి 4 న కనువిందు చేయనున్న క్వాడ్రాన్టిడ్ ఉల్కాపాతం..!!!

SMTV Desk 2018-12-29 16:18:17   Quadrant-id meteor shower, NASA, India, Europe

December 28.కొత్త సంవత్సరంలో మానవాళిని కనువిందు చేయడానికి ఖగోళం సిద్దమయ్యింది. వచ్చే నెల 4న ఉల్కలు ఆకాశం నుండి జారిపడనున్నాయని నాసా శాత్రవేత్తలు వెల్లడించారు. దీన్ని క్వాడ్రాన్టిడ్ ఉల్కాపాతంగా పిలుస్తారు. అయితే ఇది కేవలం యూరప్, ఉత్తర అమెరిక ఖండాల్లో కనిపిస్తుంది, ఇండియాలో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. కాని ఇప్పుడు మాత్రం ఇది ఇండియాలో కూడా కనువిందు చేయనుంది. జనవరి 4 వ తేదిన తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో ఉల్కాపాతం కనిపిస్తుందని వారు చెప్పారు. కాగా ఇది ఖచ్చితంగా ఇదే టైం కి వస్తుంది అని వారు చెప్పలేదు కనుక ఓపిక ఉన్నవారు తీరిగ్గా ఆకాశం వైపు చూస్తె ఇది కనిపిస్తుందని చెప్పారు. దీన్ని చూసేందుకు టెలిస్కోపులు, బైనాక్యులర్లు అవసరం లేదని చీకట్లో 30 నుంచి 40 నిమిషాలపాటు ఉంటే స్పష్టంగా చూడొచ్చు అని నాసా వివరించింది.