శ్రీవిష్ణు కొత్త చిత్రం 'బ్రోచేవారెవరురా'..!!

SMTV Desk 2018-12-29 16:15:08  Sri vishnu, Nivedha Thomas,New Movie

హైదరాబాద్, డిసెంబర్ 29: యువ హీరో శ్రీవిష్ణు మొదటి నుంచి కొత్తదనానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వైవిధ్యభరితమైన పాత్రలే ఆయనకి మంచి పాత్రలను తెచ్చిపెట్టాయి. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా నటిస్తున్న సినిమా బ్రోచేవారెవరురా . విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తోన్న ఈ సినిమాకి విష్ణు దర్శకుడు, మరో కథానాయికగా నివేద పేతురాజ్ నటిస్తుంది.


క్రైమ్ కామెడీగా ప్రధానంగా రూపొందనున్న ఈ సినిమాలో సత్యదేవ్, రాహుల్, ప్రియదర్శి ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగులో ఇంతవరకూ వచ్చిన క్రైమ్ కామెడీ చిత్రాల జాబితాలో ఈ సినిమా ముందువరుసలో నిలవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.