నిర్విరామంగా కొనసాగుతున్న గని కార్మికుల గాలింపు

SMTV Desk 2018-12-29 13:32:54  Coal mine employees, Meghalaya, Indian navy force

షిల్లాంగ్‌, డిసెంబర్ 29: బొగ్గు గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులను రక్షించేందుకు మేఘాలయ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా సోమవారం లిటిన్‌ నది సమీపంలోని శాన్స్‌ బొగ్గు గనిలో మూడు హెల్మెట్లను గుర్తించారు. మరోవైపు సహాయక చర్యలను చేపట్టేందుకు భారత నౌకాదళ సిబ్బంది రంగంలోకి దిగనుంది. విశాఖపట్నం నుంచి 15మంది గజ ఈతగాళ్లు శనివారం ఘటనా స్థలికి చేరుకోనున్నారు. కార్మికులను రక్షించేందుకు వీరు అత్యాధునిక పరికరాలను వినియోగించనున్నారు. సమీపంలోని లిటిన్‌ నది ఉప్పొంగడంతో గనిలోకి చేరుకున్న 15 మంది కార్మికులు డిసెంబర్‌ 13 నుంచి లోపలే చిక్కుకుపోయారు. 37 అడుగుల లోతున్న నీటిని మోటర్ల సాయంతో తోడుతున్నారు. కోల్‌ ఇండియా కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.