కార్తీ 'దేవ్' లిరికల్ వీడియో సాంగ్ రీలీజ్..!

SMTV Desk 2018-12-29 13:31:45  Karthi, Rakul preethi singh, Dev, New Movie, new song

హైదరాబాద్, డిసెంబర్ 29: తమిళ హీరో కార్తీ కథానాయకుడిగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో దేవ్ సినిమా నిర్మితమైంది. రకుల్ ప్రీతీ సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. తాజాగా ఈ సినిమా నుంచి వొక తమిళ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హృదయానికి హత్తుకునేలా ఈ మెలోడీ సాంగ్ సాగింది. నాయకా నాయికల మధ్య ప్రేమభావనాలు ఆవిష్కరించేదిగా తెరపై ఈ సాంగ్ వస్తుందని అనిపిస్తోంది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఖాకీ చిత్రం తమిళంతో పాటు తెలుగులోను ఘన విజయాన్ని దక్కించుకుంది. అందువలన ఇప్పుడు కూడా తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ వుంది. అందువలన ఇది తెలుగులో భారీ వసూళ్లనే సాధిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జోడీకి మరో హిట్ దొరుకుతుందో లేదో చూడాలి మరి.