కొత్త రికార్డు సృష్టించిన '2.ఓ'..!

SMTV Desk 2018-12-29 12:06:35  Rajinikanth, 2.O, New Record

హైదరాబాద్, డిసెంబర్ 29: సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ భారీ వసూళ్లను రాబట్టింది. విడుదల అయిన దగ్గర నుంచి కొత్త రికార్డులను నమోదు చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా, అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 మిలియన్ డాలర్స్(700 కోట్లు) ను వసూలు చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమీజాక్సన్ నటించగా, అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించారు.

ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్స్ ను రాబట్టిన చిత్రాలు 53 మాత్రమే. ఈ జాబితాలో భారత దేశం నుంచి 2 సినిమాలు మాత్రమే వున్నాయి. అందులో వొకటి ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్ .. మరొకటి రజనీకాంత్ 2.ఓ . కాగా అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా చైనా వసూళ్లతో కలుపుకుని ఈ జాబితాలో చేరింది. కానీ 2.ఓ మాత్రం చైనా వసూళ్లతో సంబంధం లేకుండగానే ఈ జాబితాలో చేరడం విశేషం. ఈ సినిమా చైనాలో విడుదల అయ్యాక ఇంకెన్ని రికార్డ్ లు సృష్టిస్తాడో వేచిచూడాలి. మొత్తానికి రజనీకాంత్ అభిమానులు ఆశించినట్టుగానే ఈ ఏడాది వొక అరుదైన రికార్డునే సొంతం చేసుకున్నాడన్నమాట.