సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరాం ధర్నా

SMTV Desk 2018-12-28 19:37:14  Paritala sriram, Paritala sunita, TDP, MP, Sakshi media, YSRCP, Thopu durthi prakash

అమరావతి, డిసెంబర్ 28: ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం టీడీపి కార్యకర్తలతో కలిసి ప్రాంతీయ సాక్షి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తనపై వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని శ్రీరాం ఆరోపించారు. సాక్షికి వ్యతిరేకంగా పరిటాల వర్గీయులు అక్కసును వెళ్లగక్కారు. దీనిపై రాఫ్తాడు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను బయటపెడుతున్నందనే ఉద్దేశ్యంతోనే పరిటాల వర్గీయులు ధర్నాలు చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరిటాల కుటుంబం చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నందుకే సాక్షిపై పరిటాల కుటుంబం ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు.