హైదరాబాద్ కు చేరుకున్న కేసీఆర్

SMTV Desk 2018-12-28 19:25:18  Telangana, CM, KCR, New delhi, Hyderabad city, Begumpet airport, Mamata benarjee, Federal frunt

హైదరాబాద్, డిసెంబర్ 28: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని కొద్ది సేపటిక్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సిఎం కేసీఆర్‌ ఈ నెల 23న రాష్ర్టాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 23న వొడిశా సీఎం నవీన్ పట్నాయక్, 24న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. 24న రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. 26న ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.