బుమ్రా సంచలన రికార్డు

SMTV Desk 2018-12-28 19:13:54  Team india, Australia, Test match, Melbourne Cricket Ground (MCG), Melbourne, Kohli, Bumrah, Dileep joshi

మెల్‌బోర్న్‌, డిసెంబర్ 28: ఆసిస్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్‌బోర్న్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. 39 ఏళ్లుగా పదిలంగా ఉన్న దిలీప్‌ జోషి రికార్డును బ్రేక్‌ చేశాడు. రాకెట్‌ వేగంతో బంతలను సంధించి ఏకంగా వొకే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన బుమ్రా ఈ ఏడాది ఇప్పటి వరకు 44 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌ గా రికార్డులకెక్కాడు. 1979లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే దిలీప్‌ జోషి 40 వికెట్లు పడగొట్టాడు. 44 వికెట్లతో బుమ్రా ఆ రికార్డును ఇప్పుడు బద్దలుకొట్టాడు