U-టర్న్ సీఎం అంటున్న జీవీఎల్

SMTV Desk 2018-12-28 18:45:29  GVL Narshimharao, Chandrababu, Nara lokesh, AP, Vishaka utsav, Member of rajyasabha, KCR

అమరావతి, డిసెంబర్ 28: ఏపీ లోని విశాఖ ఎయిర్ షోకు కేంద్రం నిరాకరించేసరికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. అయితే దీనికి బీజేపి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ చంద్రబాబు,లోకేష్ లపై ధ్వజమెత్తారు. చంద్రబాబు యూటర్న్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. హైకోర్టు విభజన విషయంలోనూ చంద్రబాబు ప్లేటు మార్చారని మండిపడ్డారు. విభజన చట్టం అమలులో భాగంగా కేంద్రం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సహకరిస్తే.. నీచంగా రాజకీయం ఆపాదిస్తున్నారన్నారు.





హైకోర్టు విభజన విషయంలో క్రెడిట్ అంతా తమదేనని నిన్నటికినిన్న ఎంపీ కె రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారని గుర్తు చేశారు. అందుకే టీడీపీ నేతలను మీ ‘‘బతుకులు చెడ అని కేసీఆర్ ఊరికే అనలేదన్నారు. మరో ట్వీట్ లో విశాఖ ఎయిర్ షో రద్దుపై స్పందించారు. ‘‘లోకేష్ బాబు, మీరు మీ నాన్న గారు ప్రతి ఉదయం "చచ్చు డ్రామాలు" ఆడటం మానేస్తే మంచిది. ఎవరు ఎయిర్ షోకు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు క్యాన్సిల్ చేసారు? దొంగ డ్రామాలు ఆపండి. ఎన్ని వేషాలు వేసినా మీకు ఓటమి తప్పదు. తెలంగాణ లో ఫెయిల్ అయిన వ్యూహాన్నే ఆంధ్రలో అమలు చేస్తున్న మీ తెలివితేటలు అమోఘం అంటూ ట్వీట్ చేశారు.