తమ్ముడి కోసం త్యాగం చేసిన బన్నీ..!

SMTV Desk 2018-12-28 17:41:27  Allu Arjun, Sai Dharma Tej, new movie, Trivikram, Parusuram

హైదరాబాద్, డిసెంబర్ 28: స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కి వొకటి రెండు పరాజయాలు ఎదురైనా తన స్టార్ డమ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సాయిధరమ్ తేజ్ పరిస్థితి అలా కాదు, హిట్ కొడితేనే తన స్థానాన్ని కాపాడుకోగలడు. కొంతకాలంగా ఆయన హిట్ కోసం సతమతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ వొక త్యాగం చేసాడు. బన్నీ కోసం త్రివిక్రమ్ వొక కథను సిద్ధం చేస్తే, గీత గోవిందం దర్శకుడు పరశురామ్ మరో కథను రెడీ చేశాడు.

అయితే హిట్ అనేది తనకంటే సాయిధరమ్ తేజ్ కి ఎక్కువ అవసరం అని భావించిన బన్నీ, ఆ సినిమాను సాయిధరమ్ తేజ్ తో చేయమని పరశురామ్ తో చెప్పాడట. ముందుగా అనుకున్నట్టే త్రివిక్రమ్ తో కలిసి బన్నీ సెట్స్ పైకి వెళతాడు. బన్నీ కోసం పరశురామ్ తయారు చేసుకున్న కథలో కథానాయకుడిగా తేజు కనిపిస్తాడు. ఈ సినిమా హిట్ కొడితే బన్నీ చేసిన త్యాగానికి ఫలితం లభించినట్టే.