స్మిత్ పై ఆరోపణలు చేసిన మాజీ కోచ్

SMTV Desk 2018-12-28 17:04:21  Steve smith, Daren leeman, Australia, Captain, Ball tampering

ఆస్ట్రేలియా, డిసెంబర్ 28: ఆసిస్ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వలనే ఆసీస్‌జట్టు, బోర్డు తల దించుకోవాల్సి వచ్చిందని మాజీ కోచ్‌ డారెన్‌ లీమన్‌ అభిప్రాయపడ్డారు. ఆ ఘటనతో సంబంధం లేకపోయినా స్మిత్‌ చేసిన పనికి తానుకూడా నైతిక బాధ్యత వహించి కోచ్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ సమయంలో జట్టు కోచ్‌గా డారెన్‌ వ్యవహరించారు. స్మిత్‌ ఏమరపాటు వలనే బాల్‌ ట్యాంపరింగ్‌ జరిగిందని తెలిపారు.