భారీ వసూళ్లతో షారుక్ ని వెనక్కి నెట్టిన 'కేజీయఫ్' !

SMTV Desk 2018-12-28 17:02:30  Yash, KGF Movie, Collections, Sharukh Khan, Zero

హైదరాబాద్, డిసెంబర్ 28: కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ భారీ వసూళ్ళ దిశగా దూసుకుపోతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లోను ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదలైంది. తెలుగులో అదే రోజున వరుణ్ తేజ్ అంతరిక్షం ..శర్వానంద్ పడి పడి లేచె మనసు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇక హిందీలో అయితే ఇదే రోజున బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ జీరో సినిమా విడుదలైంది. అయినా ఈ సినిమా రెండు భాషల్లోని గట్టి పోటీని తట్టుకుని నిలబడింది. షారుక్ జీరో నాలుగు రోజుల్లో 69 కోట్లు వసూలు చేస్తే, కేజీఎఫ్ నాలుగు రోజుల్లో 75 కోట్లు రాబట్టడం విశేషం. ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను 5 కోట్లకి సాయి కొర్రపాటి కొనుగోలు చేయగా, ఇప్పటికే 6 కోట్లకి పైగా షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా, తన జోరును మరింత పెంచుతుండటం విశేషం.