గాలి జనార్దన్ రెడ్డిపై సిట్‌ చార్జ్‌షీటు

SMTV Desk 2018-12-28 11:24:01  Gali Janardhana Reddy, sit, charge sheets

బెంగళూరు, డిసెంబర్ 28: అక్రమ గనుల తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్దన రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం బెంగళూరులోని లోకాయుక్త కోర్టులో చార్జిషీటు సమర్పించింది. షేక్‌సాబ్ అనే వ్యక్తికి సంబంధించిన మైనింగ్ స్థలాన్ని కాంట్రాక్ట్ తీసుకున్న జనార్దన రెడ్డి అందులో అక్రమ తవ్వకాలకు పాల్పడినట్టు సిట్ ఆరోపించింది. ఇందులో గాలి జనార్దనరెడ్డిని ఏ1గా, అలీఖాన్‌ను ఏ2గా, శ్రీనివాసరెడ్డిని ఏ3 నిందితులుగా పేర్కొంది.

కాగా, యాంబిడెంట్ ముడుపుల కేసులో గాలి జనార్దన రెడ్డిని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ దాడుల నుంచి రక్షిస్తానంటూ ఓ వ్యాపారి నుంచి భారీగా లంచం తీసుకున్న కేసులో ‘గాలి ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు.