రేపే రీలీజ్ కాబోతున్న 'బ్లఫ్ మాస్టర్'..!

SMTV Desk 2018-12-27 19:33:47  Bluff Master, Satyadev

హైదరాబాద్, డిసెంబర్ 27: సత్యదేవ్ హీరోగా, నందిత శ్వేత కథానాయికగా నటించిన బ్లఫ్ మాస్టర్ చిత్రం నిర్మితమైంది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకురానుంది. పూర్తిగా డబ్బు నేపథ్యంలో సాగె ఈ సినిమా రేపు బాక్స్ ఆఫీస్ ముందు తన అదృష్టం పరీక్షించుకోనుంది. జీవితంలో నిత్యం జరిగే మోసాల ఆధారంగా నిర్మితమైన బ్లఫ్ మాస్టర్ లో డబ్బుకన్నా ముఖ్యమైనది ప్రేమ అని చాటి చెప్పనున్నారు. ఈ సినిమాలో బ్లఫ్ మాస్టర్ గెటప్స్ .. ఆయన మోసం చేసే తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చిన్న సినిమాల్లో పెద్ద సినిమాగా బ్లఫ్ మాస్టర్ నిలవనుందా లేదా వేచి చూడాలి.