‘యన్.టి.ఆర్’ సినిమాలో బాలకృష్ణ ఎవరో తెలుసా?

SMTV Desk 2018-12-27 19:11:53  NTR Biopic, Balakrishna, Krish

హైదరాబాద్, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్ . ఈమధ్య విడుదలైన చిత్ర ట్రైలర్ సంచలనాలు నమోదు చేసింది. అతి తక్కువ సమయంలో లక్షలాదిమంది దీనిని వీక్షించారు. అంతేకాదు, ఈ ట్రైలర్ తో అంచనాలను మరింత పెరిగాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటిస్తుండగా, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ తదితరులు నటిస్తున్నారు. కానీ, మరి ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో మొదలైంది. ఈ విషయం గురించి చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోనూ బాలకృష్ణ పాత్రధారి కనిపించలేదు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కనిపిస్తుండగా, బాలకృష్ణ మాత్రం కనిపించడం లేదు. దీంతో, ఇంతకీ ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఉందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. అయితే, బాలకృష్ణ పాత్రను బాలకృష్ణే చేశారని, బాలకృష్ణ పాత్రలో ఆయన తనయుడు మోక్షజ్ఞ నటించినట్టు వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తలను యూనిట్ కొట్టిపడేసింది. కాగా, ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను జూనియర్ ఆర్టిస్టులతో పూర్తి చేసినట్టు తెలుస్తోంది.