బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించిన అర్జున్ రెడ్డి .!

SMTV Desk 2018-12-27 13:05:33  Vijay Devarakonda, Bollywood offer, Ranaveer Singh, 83 Movie, Karan johar

హైదరాబాద్, డిసెంబర్ 27: వరుస హిట్లతో జోరుమీదున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న 83 అనే చిత్రంలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను పోషించే అవకాశం విజయ్ కు వచ్చిందట. కానీ, ఆ ఆఫర్ ను విజయ్ తిరస్కరించాడని సమాచారం.

బాలీవుడ్ లోకి వొక రేంజ్ లో ఎంట్రీ ఇవ్వాలనే యోచనలో ఉన్నాడంట విజయ్. ఈ నేపథ్యంలో, తొలి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించడం ఇష్టం లేక... ఆఫర్ ను విజయ్ తిరస్కరించాడట. మరోవైపు విజయ్ తో ప్రముఖ సినీదర్శకుడు కరణ్ జొహార్ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. అంతా ఓకే అయితే, ఇద్దరూ కలసి వొక భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది.