సింగపూర్ మంత్రితో సమావేశమైన నారా లోకేష్

SMTV Desk 2018-12-27 11:48:38  AP, Minister, Nara lokesh, Singapoor trip, Governament of singapoor, NR Nathan fellowship, Singapoor minister, Balakrishnan

సింగపూర్, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, తెదేపా నేత నారా లోకేష్ బుదవారం సింగపూర్ కు చేరుకున్న విషయం తెలిసిందే. సింగపూర్‌ ప్రభుత్వం ఎస్‌ఆర్‌ నాథన్‌ ఫెలోషిప్‌ గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాలోకేష్ కు ప్రకటించిన సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. అయితే ఈరోజు సింగపూర్‌ విదేశంగమంత్రి వీవీఎన్‌ బాలకృష్ణతో లోకేష్ సమావేశమ్యారు. ఈ సందర్భంగా సింగపూర్ ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్‌ను లోకేష్‌కు బాలకృష్ణన్ అందజేశారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమరావతి నిర్మాణంలో జరుగుతున్న పురోగతి గురించి బాలకృష్ణన్‌కు మంత్రి వివరించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కష్టాలు అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏపీ అభివృద్ధికి సింగపూర్ సహకారం నిరంతరం కావాలని సింగపూర్ మంత్రిని లోకేష్‌ కోరారు.