నాగబాబుకూ ఓ గ్లాస్ ఇవ్వండి : శ్రీ రెడ్డి

SMTV Desk 2018-12-26 19:25:46  janasena,pk,pawan kalyan,naga babu,sri reddy, sri reddy comments,sri reddy latest

హైదరాబాద్, డిసెంబర్ 26: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, బీజేపీ, వైసీపి వంటి పార్టీలకు దీటుగా పోటీ చెయ్యడానికి సిద్దమైన జనసేన పార్టీకి ఈ మధ్యే ఎన్నికల కమిషన్ గుర్తును కేటాయించింది. ‘గాజు గ్లాస్‌ ను జనసే పార్టీ ఎన్నికల గుర్తుగా కేటాయించినట్టు ఆ పార్టీ ధ్రువీకరించింది. అయితే జనసైనికులు ఆ పార్టీ గుర్తును భాగానే ప్రచారం చేస్తున్నారు. ఈ గుర్తు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిద్తూ ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.

అయితే ఈ గుర్తుపై ప్రముఖ వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ వివాదాస్పద సినీ నటి శ్రీ రెడ్డి దీనిపై సంచలన కామెంట్స్ చేసింది. " జనసేన పార్టీ గుర్తు గ్లాస్ అంటగా...వైన్ గ్లాస్??బీర్ గ్లాస్??స్కాచ్ గ్లాస్??నాగబాబు గారికి వొక గ్లాస్ ఇవ్వండ్రా...అస్సలే రేసేంట్ గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావట్లే.." అంటూ తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై పవన్ అభిమానులు మాత్రం చాలా ఘాటుగా స్పందిస్తున్నారు.