'మీ ప్రతిభకు వీరాభిమానిని' : రాణా

SMTV Desk 2018-12-26 19:20:13  Nawazuddin Siddiqui, Amrita Rao, balasheb thakrey

హైదరాబాద్, డిసెంబర్ 26: టాలీవుడ్ భల్లాల దేవుడు దగ్గుపాటి రాణా బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖ్ పై ప్రశంశల వర్షం కురిపించారు. తాజాగా నవాజుద్దీన్ ప్రధాన పాత్రదారునిగా శివసేన పార్టీ వ్యవస్థాపక కర్త బల సాహెబ్ థాక్రే జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'థాక్రే'. ఈ చిత్ర ట్రైలర్ ని నవాజుద్దీన్ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ పై రాణా స్పందిస్తూ మీరు "ఎంతో అద్భుతమైన నటుడు మీరు...నేనెప్పుడూ మిమ్మల్ని కలవలేదు కాని నేను మీకు, మీ ప్రతిభకి వీరాభిమానిని..." అంటూ తన అభిమానాన్ని తెలుపుకున్నాడు.