మాజీ మంత్రి ,మంథని తాజా ఎమ్మెల్యే కి తప్పిన ప్రమాదం

SMTV Desk 2018-12-26 19:19:16  Duddilla sridhar babu, Congress party, MLA, Manthani, Road accident, Siddipeta

మంథని, డిసెంబర్ 26: రెండు రోజుల క్రితం మంథని తాజా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ప్రయాణిస్తున్న కారు రోడ్ ప్రమాదానికి గురి అయ్యింది. మంథని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే కార్ సిద్దిపేట దగ్గరలో వొక పంది అడ్డురావడంతో కార్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో కార్ ముందటి భాగం డామేజ్ అయింది. కార్ లో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, డ్రైవర్ మరియు ఇద్దరు గన్ మెన్ లు సురక్షితంగా బయటపడ్డారు.. దీనిపై వివరణ ఇస్తూ మంథని ప్రజల అభిమానం ఆశీర్వాదం వల్లనే ఏమి కాలేదని బాగానే వున్నట్టు తాజాగా వొక వీడియో రిలీజ్ చేసారు..