వైసిపి టికెట్ ధర రూ.10 కోట్లు...!!!

SMTV Desk 2018-12-26 18:51:23  TDP, YSRCP, YS Jagan mohan reddy, MP, Diwakar reddy, Naveen nischal

అనంతపురం, డిసెంబర్ 26: జిల్లలో జరుగుతున్న తెదేపా ధర్మపోరాట దీక్షలో ఆ పార్టీ ఎంపి దివాకర్ రెడ్డి పాల్గొని, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో అయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి నుండి టికెట్ ఆశిస్తున్న నవీన్ నిశ్చల్ ను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ రూ.10 కోట్లు అడిగారు అని చెప్పారు. దీంతో నవీన్ కు ఎం చెయ్యాలో తెలేయక అయోమయంలో పడ్డారని చెప్పుకొచ్చారు.

జగన్ మోహన్ రెడ్డి వొక్క టికెట్ కోసమే రూ.10 కోట్లు అడిగితే రాష్ట్రాభివృద్దికి ఎంత తీసుకుంటారో అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాక జగన్ కులం పేరుతో గెలవడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.