జనసేన గుర్తు పై కత్తి మహేష్

SMTV Desk 2018-12-26 18:16:40  kathi mahesh,kathi mahesh latest news,kathi mahesh comments

హైదరాబాద్, డిసెంబర్ 26 : కత్తి మహేష్ ఎప్పుడూ ఎదో విషయం మీద విమర్శలు చేస్తూ వార్తలలో ఉండే ​క్రిటిక్. మొన్న ఈ మధ్య శ్రీ రాముడిని నోటికొచ్చినట్లు తిట్టి నగర బహిష్కరణకు గురయ్యాడు . ఎప్పుడూ డిబేట్ లలో పాల్గొనే కత్తి ఆ తరువాత నుండి వొక్క ఛానల్ మినహా వేరే ఏ ఛానల్ కనబడ్డ దాఖలాలు అంతగా లేవు .

ఇటీవల జనసేన పార్టీ గుర్తుగా ఈసి గాజు గ్లాసుని నిర్ణయించిన సంగతి తెలిసిందే కాగా దీనిపై స్పందిస్తూ కత్తి మహేష్ గాజు గ్లాస్ , తబలా , బక్కెట్ ఆ మూడింటి ఫోటోలను పక్క పక్కనే ఉంచి వీటిలో జనసేన గుర్తేమిటో చెప్పుకొండి చూద్దాం ? అని పోస్ట్ చేశాడు . విషయం ఏంటంటే మూడు వస్తువుల ఫోటోలు చూడడానికి వొకే రకంగా ఉన్నాయ్ , పొరపాటున ఇంకో పార్టీ పుట్టుకొచ్చి దానికి తబలా లేదా బక్కెట్ గుర్తు ఇస్తే తడబడం ఖాయం అనే ల ఉన్నాయి.