మోదీతో భేటీ అయిన సీఎం కేసీఆర్.!

SMTV Desk 2018-12-26 17:58:31  Narendra Modi, KCR

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. 7 లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో ఆయన్ని కేసీఆర్ కలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మోదీని కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కేసీఆర్ కోరనున్నారు. రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపైనా చర్చించనున్నట్టు సమాచారం.

జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు సీఎం కెసిఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కేసీఆర్‌ ఇప్పటికే వొరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమత బెనర్జీతో పాటు బీఎస్పీ అధినేత మాయావతితో కూడా భేటీ అయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.