బాలయ్యకు నాగబాబు కౌంటర్‌..!!

SMTV Desk 2018-12-26 17:48:06  Balakrishna, Nagababu, Social media, School boy, Saare jah ha se acha

హైదరాబాద్, డిసెంబర్ 26: మొన్నటి వరకు బాలకృష్ణ అంటే ఎవరో తనకి అస్సలు తెలీదు అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించిన నాగబాబు. మరోసారి సోషల్ మీడియాలోకెక్కాడు. ఓ స్కూల్ విద్యార్థి చక్కగా ఏ మాత్రం తడబడకుండా దేశ భక్తి గీతం సారే జహాసే అచ్చా పాడిన వీడియోను నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాలయ్యకు కౌంటర్‌గానే నాగబాబు ఈ వీడియో పోస్టు చేసినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య సారేజ‌హాసె అచ్చా దేశ భక్తి గీతాన్ని ఖూనీ చేసి న‌వ్వుల‌పాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది.





బుల్‌బుల్‌ బాలయ్య అంటూ బాలయ్యను విపరీతంగా ట్రోల్ చేశారు. దీనికి కౌంటర్‌గానే నాగబాబు ఈ చిన్నపిల్లోడు పాడిన వీడియో పోస్ట్‌ చేశారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ' ఆర్ ఆర్ ఆర్ ' సినిమాతో మెగా ఫాన్స్ నందమూరి ఫ్యాన్స్ వొక్కటవుతన్నారు , అలాంటి ఈ శుభ సమయంలో నాగబాబు ఇలాంటి కాంట్రవర్సిలకు కావాలని దిగడం దేనికి సంకేతం ?