మూడో టెస్ట్ తోలి రోజు ముగిసిన ఆట

SMTV Desk 2018-12-26 16:04:45  Team india, Australia, Test match, Melbourne Cricket Ground (MCG), Melbourne, Kohli, Mayank

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 26: భారత్ - ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా నేడు మెల్‌బోర్న్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. తొలి టెస్టులోనే అర్ధశతకం బాదిన మయాంక్‌ 76 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. మరో ఓపెనర్ హనుమ విహారి 8 పరుగులు చేసి కుమ్మిన్స్ బౌలింగ్ లో ఫించ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ (47), చటేశ్వర్ పుజారా (68) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టు భారీ స్కోర్ చేసేందుకు గట్టి పునాది వేశారు. రెండో రోజు కూడా ఈ జంట రాణిస్తే భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, నాలుగు టెస్టుల సిరీస్ లో మొదటి టెస్టుని భారత్ గెలుచుకోగా, రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మూడో టెస్టు గెలిచి సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.