ఆరంగేట్రంలోనే అదరగొట్టిన మయాంక్

SMTV Desk 2018-12-26 12:45:53  Team india, Australia, Test match, Melbourne Cricket Ground (MCG), Melbourne, Kohli, Mayank

న్యూ, ఢిల్లీ, డిసెంబర్ 26: ఆసిస్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్‌బోర్న్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన రాహుల్, విజయ్‌ను పక్కనబెట్టిన భారత్ ఈ మ్యాచ్‌లో కొత్త జోడీని బరిలోకి దింపింది. వీళ్లిద్దరి స్థానంలో విహారి, మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

మయాంక్ అగర్వాల్‌ తన తొలి ఇన్నింగ్స్ లోనే 76 పరుగులు చేసి ఆసిస్ బౌలర్ కమ్మిన్స్ చేతిలో ఔటయ్యాడు. ఇలా తొలి అంతర్జాతీయ టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎలాంటి వొత్తిడికి లోనుకాకుండా బలమైన ఆసీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని పాట్ కమిన్స్ బౌలింగ్‌లోనే టిమ్ పైనె క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు.