బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో గెలుపెవరిదో...???

SMTV Desk 2018-12-26 11:53:59  Team india, Australia, Test match, Melbourne Cricket Ground (MCG), Melbourne, Kohli

న్యూ, ఢిల్లీ, డిసెంబర్ 26: ఆసిస్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్‌బోర్న్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్ లో ఇదవరకు జరిగిన రెండు టెస్టులలో ఇరు జట్లు చెరో టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే. ఆసిస్ తో ప్రారంభ మ్యాచ్ లోనే రికార్డు సృష్టించిన టీం ఇండియా ఆపై జరిగిన పెర్త్ టెస్ట్ లో ఊహించని విధంగా పరాజయ పాలైంది. దీంతో 1-1 తో రెండు జట్లు సమంగా నిలిచి నేడు మెల్‌బోర్న్‌ బాక్సింగ్‌ డే టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ మ్యాచ్ లో కేవలం ఎనిమిది పరుగులు చేసిన భారత్ జట్టు ఆటగాడు హనుమ విహారిని కమ్మిన్స్ అవుట్ చేయగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ ని కూడా 76 పరుగుల స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన రాహుల్, విజయ్‌ను పక్కనబెట్టిన భారత్ ఈ మ్యాచ్‌లో కొత్త జోడీని బరిలోకి దింపింది. వీళ్లిద్దరి స్థానంలో విహారి, మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

మొదటి వికెట్‌కు ఈ జోడీ 40 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. మయాంక్ ధాటిగా ఆడగా, విహారి మాత్రం ఆసీస్ బౌలర్లను ఎదుర్కొడంలో ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఆడలేకపోయిన అతడు చివరికి అదే బంతికి అవుటయ్యాడు. దాంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం భారత్ క వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. కోహ్లి 39, పుజారా ఖాతా 61 పరుగులతో క్రీజులో ఉన్నారు.