మెగాస్టార్ కి మనుమరాలు పుట్టింది

SMTV Desk 2018-12-26 11:40:44  chiranjeevi,srija,kalyan dev,pawan kalyan, mega star,pspk

హైదరాబాద్ , డిసెంబర్ 26 : శ్రీజ మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు గా పరిచయం ఉంది , 2016 లో యువ హీరో కళ్యాణ్ దేవ్ తో రెండో వివాహం జరిగింది . కాగా ఆమె నిన్న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది . ఈ విషయాన్నీ ఆమె భర్త తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అంతే కాకుండా , ఆ పాప పాదం ఫోటో కూడా పోస్ట్ చేసి తన ఆనందం పంచుకున్నాడు .

కళ్యాణ్ దేవ్, ఆ పాపని తన రెండో కూతురిగా సంబోధిస్తూ పోస్ట్ చేశాడు , నిజానికి ఆ పాప కళ్యాణ్ దేవ్ కి కలిగిన మొదటి సంతానం, కానీ శ్రీజ మొదటి భర్త తో అప్పటికే వొక ఆడ సంతానాన్ని కన్నది , విడాకులు అయ్యాక ఆ పాప బాధ్యత శ్రీజ నే తీస్కుంది. కళ్యాణ్ దేవ్ కూడా ఆ పాపని సొంత కూతురిగా అనుకుంటున్నాడు.