అకున్ కు బెదిరింపు కాల్స్

SMTV Desk 2017-07-27 13:23:17  akul sabarwal, drugs case, calls

హైదరాబాద్, జూలై 27 : హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ మాఫియా పై పలువురు ప్రముఖులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణ జరుపుతున్న అకున్ కు ఇంటర్ నెట్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సమాచారం. ఈ కాల్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నాయని ఇంటలిజెన్స్ చీప్ దృష్టికి తీసుకెళ్లగా ఐపీ అడ్రస్ జియాగూడకు చెందిన యువకుడిది అని తెలిసింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని అధికారులు విచారించారు. అయితే అతని దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. ప్రస్తుతం ఆ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడని అధికారులు వెల్లడించారు.