చెక్కు చిరగడంతో ఒక పెద్ద అవకాశం చేజారిపోయింది

SMTV Desk 2018-12-25 18:49:50  kovera,telugu movie,u movie

హైదరాబాద్ , డిసెంబర్ 25 : నూతన దర్శకుడు కోవెర తాజాగా వొక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా తన సినిమా గురించి విషయాలను ప్రస్తావిస్తూ, "చిత్రపరిశ్రమలో రచయితగా .. దర్శకుడిగా నేనేంటన్నది నిరూపించుకోవాలని అనుకున్నాను. కానీ అవకాశం రావడం అంత తేలిక కాదు అది నాకు తెలుసు. అందుకే నేనే నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా మారి యు సినిమా చేశా.

చిత్రపరిశ్రమలో నాకు వొక విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ నిర్మాత నాతో సినిమా తీస్తానని చెప్పి అడ్వాన్స్ గా 60 వేల చెక్ ఇచ్చాడు. సంతోషంగా ఆ విషయాన్ని మా ఇంట్లో వాళ్లకి చెప్పాను. బ్యాంకుకి వెళ్లి చెక్ బయటికి తీస్తూ ఉండగా చిరిగిపోయింది. అప్పుడు ఆ నిర్మాతకి ఫోన్ చెయ్యగా "చెక్ కాపాడుకోలేనివాడివి .. సినిమాను ఎలా కాపాడతావయ్యా అంటూ ఆయన ఫోన్ పెట్టేశాడు. అప్పుడు వర్షంలో నేను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాను" అని చెప్పుకొచ్చాడు.