దావూద్ బావను చంపిన వ్యక్తి అరెస్ట్.!

SMTV Desk 2018-12-25 18:31:29  Dawood Ibrahim, Relative, Mumbai police

ముంబై, డిసెంబర్ 25: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం బందువును చంపిన వ్యక్తిని ముంబై పోలీసులు 22 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత నుంచి అతను కనిపించకుండా తిరుగుతున్నాడు. గ్యాంగ్ స్టార్ అరుణ్ గావ్లీ గ్యాంగ్ కు చెందిన దయానంద్ సలియన్ అలియాస్ పుజారీని ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు వల పన్ని అరెస్ట్ చేశారు. గావ్లీ గ్యాంగ్ చేసిన పలు హత్యలు, హత్యాయత్నాల్లో పుజారీకి ప్రత్యక్షంగా సంబంధం ఉంది.

1991లో దావూద్ ఇబ్రహీం బావమరిది ఇస్మాయిల్ పార్కర్ (దావూద్ సోదరి హసీనా భర్త) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో 1993లో పుజారీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 1996లో బెయిల్ పై పుజారీ బయటకు వచ్చాడు. అనంతరం ముంబైని వదిలేసి వెళ్లి, ఉత్తరప్రదేశ్ లో మారుపేరుతో వొక వంటవాడిగా గడిపాడనేది అధికారుల కథనం.