ఊహ రీ ఎంట్రీ పై స్పందించిన శ్రీకాంత్

SMTV Desk 2018-12-25 17:05:34  ooha, amani,nadhiya,ramya krishna,srikanth

హైదరాబాద్ , డిసెంబర్ 25 :ఈ మధ్య నిన్నటి తరం కథానాయికలలో చాలామంది రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమని,ఖుష్బూ ,నదియా, రమ్యకృష్ణ,ఇప్పటికే రి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేస్తున్నారు. ఇక సిమ్రాన్ కూడా ఇదే బాటలోఉంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీకాంత్ భార్య ఊహ కూడా రీ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.

తాజాగా జరిగిన వొక ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి అడిగిన ప్రశ్న కి శ్రీకాంత్ బదులిస్తూ. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ .. "పెళ్లి తరువాత నటించకూడదనేది ఊహ నిర్ణయమే. వొకవేళ ఇప్పుడు నటించాలని ఉన్నా అది కూడా ఆమె ఇష్టమే. ఇంతకుముందు కంటే ఊహ ఇప్పుడు మరింత బిజీ కాబోతోంది అయితే పిల్లలిద్దరూ పెద్దవాళ్లు అయ్యారు ఇప్పుడు ఆమె బాధ్యతలు మరింత పెరిగాయి. మా పెద్దబ్బాయితో పాటు చిన్నబ్బాయి కూడా సినిమాల్లోకి వస్తున్నాడు". అని చెప్పుకొచ్చారు ఆయన సమాధానాన్ని బట్టి ఊహ రీ ఎంట్రీ లేదేమోనని అర్ధమవుతుంది.