ఇమ్రాన్‌ ఖాన్‌కు కౌంటర్‌ ఇచ్చిన కైఫ్‌..!

SMTV Desk 2018-12-25 17:04:55   Imran Khan, Mohammad kaif, Minorities

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: భారత్‌లో మైనార్టీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది. మైనార్టీలతో ఎలా మెలగాలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చూపెడతామని అని ఇటీవల పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ఘాటుగా స్పందించారు. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్‌లో మైనార్టీల జనాభా శాతం 20శాతం ఉంటే ఇప్పడు 2 శాతానికి పడిపోయింది. భారత్‌పై పాకిస్తాన్‌ ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలి. పాక్‌తో పోలిస్తే మైనార్టీలు భారత్‌లోనే క్షేమంగా ఉన్నారు . అంటూ ట్విటర్‌ వేదికగా కైఫ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై భారత్‌లోని అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుత్తున్నాయి. పాక్‌ ప్రధాని వ్యాఖ్యలను ఎంఐఎం నేత అసదుద్దీన్‌ వొవైసీ కూడా ఖండించారు. కాగా ఇమ్రాన్‌, కైఫ్‌ ఇద్దరూ కూడా మాజీ క్రికెటర్లు కావడం గమన్హారం.