అనిల్ రావిపూడి కి వచ్చిన డౌట్

SMTV Desk 2018-12-25 13:27:19  NTR,NBK,NTR BIOPIC,ANIL RAVIPUDI,F2

హైదరాబాద్ , డిసెంబర్ 25 : ఇటీవల లాంఛనంగా జరిగిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో వేడుకలో 'పటాస్' డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ " క్రమశిక్షణ, నిజాయితీ ,నిబద్ధత,మానవత్వం ,నాయకత్వం,తెగింపు , రాజసం ఇలాంటి గొప్ప లక్షణాలున్న మూడక్షరాల పదం , మూడు తారలు చూసిన అద్భుతం , మరో 30 తరాలయినా తలుచుకునే చరిత్ర యన్ .టి .ఆర్ " అని అన్నారు .

"బాహుబలి చూశాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అనే డౌట్ చాలా రోజులు ట్రెండ్ ఐయింది , యన్ .టి .ఆర్ సినిమాలో కూడా నాకో డౌట్ ఉంది అదేంటంటే అన్నగారి పాత్ర బాలయ్య బాబు చేస్తున్నాడు , మరి బాలయ్య గారి పాత్ర ఎవరు చేస్తున్నారు అని ".

అనిల్ రావిపూడి కి వచ్చిన డౌట్ ఇపుడు అందరి మదిలో కూడా మెదులుతుంది ఆలోచించండి ఎవరు చేసుంటారో ?