ముద్రగడ హౌస్ అరెస్ట్ పొడిగింపు

SMTV Desk 2017-07-27 12:31:10  mudragada paadayaatra, kaapu reservation, mudragada house arest, mudragada

కాకినాడ, జూలై 27: ముద్రగడ హౌస్ అరెస్ట్‌ను కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సెక్షన్ 144(3) ప్రకారం ఆగష్టు 2వ తేదీ వరకు పొడిగించినట్లు ఓఎస్డి రవిశంకర్ తెలిపారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కిర్లంపూడిలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన ముద్రగడ పద్మనాభం గత కొంత కాలంగా కాపు రిజర్వేషన్‌ల కోసం పోరాడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు నిరసనలు ఆపేది లేదని కాపు నాయకులు స్పష్టం చేశారు.