పవన్ యూరప్ ట్రిప్ పై అనుమానాలు...

SMTV Desk 2018-12-25 11:11:26  Pawan kalyan, Janasena party, Euorope trip, Social media, Twitter

అమారావతి, డిసెంబర్ 25: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అతని మూడో భార్య స్వస్థలం యూరప్ పర్యటనకు ఈ మధ్యే వెళ్లారు. పవన్ అన్నా లెజనోవా కి పుట్టిన శంకర పవనోవిచ్ కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయాల్సి ఉన్న కొన్ని తంతులను ఈ క్రిస్మస్ సందర్భంగా చేయడానికి పవన్ ను ఆయన భార్య కోరింది. ఈ నేపథ్యంలో, కుటుంబంతో కలసి ఆయన బయల్దేరాడు. యూరప్ పర్యటన తర్వాత అమరావతిలో పార్టీ శ్రేణులకు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని ట్విట్టర్ లో చెప్పాడు. అయితే ఈ ట్రిప్ పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వివిధ ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో పవన్ యూరప్ ట్రిప్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తుండటంతో పవన్ కళ్యాణ్ ఇక విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తిష్ట వెయ్యాలని భావిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా పవన్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పార్టీ గుర్తును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.