కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డ మరో భామ

SMTV Desk 2018-12-24 16:14:54  adithi rao hydari,antariksham,casting couch,sri reddy

హైదరాబాద్ , డిసెంబర్ 24 : శ్రీ రెడ్డి గొడవతో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య తారా స్థాయిలో వెలుగులోకి వచ్చింది , చాలా మంది తమకి ఎదురయిన సంఘటనలను మీడియా ముందు వెళ్లగక్కారు . కాగా సినీ నటి అదితీరావ్ హైదరీ కూడా దీని పై తన అనుభవాన్ని తెలిపింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తన కెరీర్ ప్రారంభంలో తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది. వొకసారి వొక ప్రాజెక్ట్ సంబంధించి అడ్జస్ట్ అయితే మరిన్ని ఛాన్స్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని తెలిపింది.

అయితే, దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆ ప్రాజెక్టు వదులుకున్నాని చెప్పింది . ఆ తరువాత ఎనిమిది నెలల పాటు సినిమా ఛాన్స్ లు రాక చాలా అప్ సెట్ అయ్యానని చెప్పింది. ఇక సినిమాల్లో నటించలేనా? అని తనలో తాను కుమిలిపోయానని చెప్పింది. అయితే తన టీమ్, తన మేనేజన్ తనను నెగెటివ్ ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చారని తెలిపింది.